ప్రత్యేకం హోమ్

ఒంటిమిట్టలో తెలుగుదేశం ఘన విజయం

#TDP

ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6351 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12505 ఓట్లు వచ్చాయి. దాంతో టీడీపీ మెజారిటీ 6154కు చేరింది. ఒంటిమిట్టలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. కడప పాలిటెక్నిక్ కళాశాలలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్‌కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి అయింది. ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ కౌంటింగ్‌‌ను వైసీపీ నేతలు బహిష్కరించిన విషయం తెలిసిందే.

Related posts

సంచలన విషయాలు బయటపెట్టనున్న లేడీ డాన్ అరుణ?

Satyam News

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Satyam News

చీకటి పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

Satyam News

Leave a Comment

error: Content is protected !!