విదేశీ యువతులతో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బకారం గ్రామ రెవెన్యూలోని S K Nature Retreat ఫార్మ్ హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరుగుతున్నది. ఈ మేరకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ పార్టీపై SOT, స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ వేడుకలో నైజీరియా, ఉగాండా దేశాలకు చెందిన 50 మందికి పైగా విదేశీయులు పాల్గొన్నారు. పార్టీలో గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం వాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు సడన్ రైడ్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి పర్మిషన్ ఉందా? మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు? డ్రగ్స్ వినియోగించారా? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
previous post