చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే లోకేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ నెల 14న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున అనే మహిళ అబ్దుల్లాపూర్ రోడ్ పక్కన తన పశువులను మేపుతూ ఒంటరిగా ఉన్నది. దాంతో ఆమె మెడలో నుంచి బంగారం గొలుసులు దొంగలించి ఒక వ్యక్తి బైక్ పై పారిపోయాడు. సీసీ కెమెరాలలో రికార్డు అయినా సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దాంతో అతను ఆష్ట గ్రామానికి చెందిన పిప్పెర విజయ్ అనే వ్యక్తిగా గుర్తించారు.
కేసు నమోదు అయిన 24 గంటల్లోపే ఛేదించి నేరస్థుని పట్టుకున్నారు. కోర్టులో హాజరు పరచగా జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. నేరస్థుని వద్ద నుండి రెండు తులాల బంగారం పుస్తెలతాడు, నేరం చేయడానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నేరస్తుని పట్టుకున్న లోకేశ్వరం ఎస్ఐ జి.అశోక్ ను, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సాయి ప్రశాంత్, లక్ష్మణ్ లను నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, బైంసా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ జి మల్లేష్ అభినందించారు.