కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. మార్కెట్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ జీ భరత్ పాల్గొన్నారు. మంత్రికి నూతన చైర్మన్ అజ్మత్ బీ వైస్. చైర్మన్ శేషగిరి శెట్టి గజమాలతో స్వాగతం పలికారు. మార్కెట్ యార్డు కార్యదర్శి జయలక్ష్మి నూతన పాలకమండలి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గానికి చెందిన మార్కెట్ కమిటీ ని గత ప్రభుత్వంలో ఇతర నియోజకవర్గ నాయకులు పదవులు తీసుకున్నారని కూటమి ప్రభుత్వంలో అలాంటి పనులు జరగవని తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు.
previous post
next post