ప్రజా జీవితంలో రాజకీయ నాయకులకు కొన్ని సిద్ధాంతాలు, నిబద్ధతలు ఉంటాయి. ఆ నిబద్ధతను జీవితంలో ప్రతి సందర్భంలోనూ పాటించడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం డాక్టర్ నిమ్మల రామానాయుడుది. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా ఆయన దైనందిన జీవితంలో నిత్యం పసుపు చొక్కాలోనే కనిపిస్తారు. ఇది కేవలం ఒక పార్టీ రంగు మాత్రమే కాదు, ఆయన ఆశయాలకు, ఆదర్శాలకు ప్రతీక.
తాజాగా, తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం లాంటి అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత సందర్భంలో కూడా నిమ్మల రామానాయుడు అదే పసుపు చొక్కాతో కనిపించడం ఆయన నిబద్ధతకు, పార్టీ పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ఒక తండ్రిగా ఆయన వ్యక్తిగత సంతోషాన్ని పంచుకునే సందర్భంలోనూ తాను నమ్ముకున్న పార్టీ రంగును వదులుకోకపోవడం అభినందనీయం.
ఈ చిత్రం ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రజా సేవకుడిగా ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మంత్రిగా, శాసనసభ్యుడిగా ఆయన ప్రజలకు ఎంత నిబద్ధతతో సేవ చేస్తారో, అదే నిబద్ధతను తన వ్యక్తిగత జీవితంలో కూడా పాటిస్తారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు ఈ నిబద్ధత నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం, హ్యాట్సాఫ్!