జాతీయం హోమ్

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆదివారం తెల్లవారుఝామున ఆయుధధారులు కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఆయన ఇంటిపై పలు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే ఎల్విష్ ఆ సమయంలో అక్కడ లేరు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల ప్రకారం, ఈ ఘటన ఉదయం 5.30 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని సెక్టర్ 57లో ఉన్న ఆయన నివాసంలో చోటుచేసుకుంది. గుండెలు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తులను తాకినట్టు సమాచారం. ఇంట్లో కేర్‌టేకర్ మరియు కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా, ఎవరూ గాయపడలేదు.

గురుగ్రామ్ పోలీస్ పీఆర్ఓ సందీప్ కుమార్ మాట్లాడుతూ, “మూడు మంది ముసుగుదారులు ఇంటి బయట కాల్పులు జరిపారు. ఓ డజన్‌కి పైగా రౌండ్లను కాల్చారు” అని తెలిపారు.

వివరాలు అందుకున్న వెంటనే పోలీసు బృందం అక్కడికి చేరుకుని ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. అలాగే ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఒక కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ, ఈ ఘటనకు ముందు ఎల్విష్‌కు ఎలాంటి బెదిరింపులు లేవని, ప్రస్తుతం ఆయన హర్యానాకు వెలుపల ఉన్నారని చెప్పారు.

Related posts

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News

కాళేశ్వరంపై హరీష్ రావు ఘాటు లేఖ

Satyam News

విశాఖకు మరో ఘనత..మహిళలకు అత్యంత సురక్షిత నగరం

Satyam News

Leave a Comment

error: Content is protected !!