ముఖ్యంశాలు హోమ్

పులివెందుల దెబ్బ.. ఏపీలో జగన్‌ మిస్సింగ్…!!

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏ రాజకీయ నాయకుడైనా జెండా ఎగరవేయడం సర్వసాధారణం. ప్రధానంగా పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ అధినేతలు జెండా ఎగరవేస్తుంటారు. ఏపీలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగియి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

కానీ వైసీపీ అధినేత జగన్‌ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జగన్ ఎక్కడా కనిపించలేదు. అధికారంలో ఉన్నా, లేకున్నా..ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా నాయకులు జెండా ఎగరవేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ జగన్‌ ఈ విషయంలో ఎక్కడా ఈ మర్యాదను పాటించలేదు. బెంగళూరులోని ప్యాలెస్‌లోనూ జెండా ఎగరవేసినట్లు ఎక్కడా కనిపించలేదు.

2019 – 2024 మధ్య అధికారంలో లేని టైంలో కూడా చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. లోకేష్‌ సైతం తన నివాసంలో కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి జెండా ఎగరవేసే కార్యక్రమంలో పాల్గొనే వారు. కానీ జగన్‌ ఓడిపోయిన ఏడాదికే వింతగా ప్రవర్తిస్తున్నారు.

ఇదే విషయమై తెలుగుదేశం పార్టీ సైతం జగన్‌ను ప్రశ్నించింది. అధికారం ఉంటేనే జెండా ఎగరవేస్తారా అంటూ ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆఖరుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పీసీసీ చీఫ్ షర్మిల సైతం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని, జగన్‌ మాత్రం ఎక్కడా కనిపించలేదని సెటైర్లు వేసింది.

Related posts

జాత్యహంకారంతో సిక్కు యువతిపై అత్యాచారం

Satyam News

ఒకేసారి లక్ష మంది ప్రయాణికులు….

Satyam News

శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో సంప్రోక్షణ

Satyam News

Leave a Comment

error: Content is protected !!