హిందూ వివాహితను లోబరుచున్న ఒక పాకిస్థానీ యువకుడు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు దొరికిపోయాడు. విస్తుపోయే నిజాలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో సింపాల్ కంపెనీలో కీర్తి జగదీశ్ అనే అమ్మాయి పనిచేస్తుండేది.
2011లో పాకిస్తాన్‌కు చెందిన సయ్యద్ ఫహాద్ అలీ అనే యువకుడు కూడా అదే కంపెనీలో పనిచేయడంతో వారిద్దరి మధ్య పరిచయం జరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కీర్తి అంతకుముందే తన భర్తకు విడాకులు ఇవ్వడంతో కీర్తి మతం మార్చి, ఆమె పేరును దోహా ఫాతిమాగా మార్చాడు ఫహద్. 2016లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్‌లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే, సిపాల్ కంపెనీలోనే పనిచేసిన మరో మహిళతో రాసలీలు కొనసాగిస్తుండగా ఫహద్‌ను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఫహద్‌తో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిద్దరిని బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. పోలీసుల విచారణలో ఫహద్ గురించి విస్తుపోయే విషయాలు తెలిశాయి. 1998లో పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన అతడు హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అమ్మాయిల మతం మార్చి ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ఫహద్ పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.