రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత కు తెలియకుండానే పెరోల్ మంజూరు అయినట్లు గుర్తించారు. ఇద్దరు నెల్లూరు ఎమ్మెల్యేలు పెరోల్‌కు సిఫార్సు చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే ల సిఫార్సు మేరకు శ్రీకాంత్‌కు హోం సెక్రటరీ పెరోల్ మంజూరు చేశారు. దీంతో హోం సెక్రటరీని హోం మంత్రి అనిత వివరణ కోరారు.
ప్రభుత్వంలో కీలక అధికారి సూచనతో పెరోల్ ఇచ్చినట్టు హోంమంత్రికి హోం సెక్రటరీ తెలిపారు. పెరోల్ రద్దు చేసి హోంమంత్రి విచారణకు ఆదేశించారు. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని హోంమంత్రి అనిత ఆదేశం ఇచ్చారు.