ముఖ్యంశాలుహోమ్

కొత్త జిల్లాలలపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి

#AnaganiSatyaPrasad

జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దులు మార్పులు చేసేందుకు తగిన సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం మొదటి సారి ఈనెల 13వ తేదీన అంటే బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో గల కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమౌతోందని రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.  గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేసినప్పుడు  ఒక నియమం అంటూ పాటించకుండా అడ్డదిడ్డంగా చేసేశారు.

దీంతో కొన్ని జిల్లాల్లో   ప్రజలు జిల్లా కేంద్రంకు వెళ్లి పని   చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.  అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తాయి. మొత్తంగా జిల్లా, మండల, గ్రామాల పేర్లను మార్చాలంటూ, వాటి సరిహద్దులు మార్చాలంటూ  ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి  పదే పదే విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమిప్రభుత్వం ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపేందుకు  రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తోపాటు మరో ఆరుగురితో మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటు చేసింది.

ఈ జీవోఎంలో  మంత్రి అనగానితోపాటు మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ, హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి,  నీటి వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఈనెల 13వ తేదీన మొదటి సారి సమావేశం కానున్నారు.  ఈ సందర్భంగా ప్రజలుగానీ, ప్రజా ప్రతినిధులు గానీ జిల్లా, మండల, గ్రామాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పుపైన వారి వినతులను సచివాలయానికి వచ్చి జీవోఎంకు సమర్పించవచ్చునని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Related posts

సమస్యల వలయంలో చిక్కుకున్న ఎయిర్ టెల్

Satyam News

ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తా:చదలవాడ

Satyam News

తిరుమల లడ్డు కల్తీలో బయటపడ్డ ‘పెద్దల’ హస్తం?

Satyam News

కేరళలో భారీ విజయం సాధించిన బీజేపీ

Satyam News

అంచనాలను మించిన వృద్ధి రేటుతో దూసుకుపోతున్న భారత్

Satyam News

ప్రతి నియోజకవర్గంలో మహిళ దినోత్సవ వేడుకలు

Satyam News

Leave a Comment