వై ఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడు ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత దాసరి కిరణ్ అరెస్టయ్యారు. విజయవాడ పడమట పోలీసులు దాసరి కిరణ్‍ను హైదరాబాద్‍లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు.
బంధువుల వద్ద తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు దాడి చేయించారని ఆరోపణలున్నాయి. రుణం తీసుకున్న రూ.5 కోట్లు చెల్లించాలని కిరణ్‍ను దంపతులు కోరారు. ఆ దంపతులపై తన అనుచరులతో కిరణ్ దాడి చేయించారని ఆరోపణలున్నాయి. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.