సిపిఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. సురవరం సుధాకర్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడుగా రెండు సార్లు ఎన్నికయ్యారు.
12, 14వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించారు. కర్నూలు ఉస్మానియా కళాశాలలో బి.ఏ పాసయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాలలో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. 1974 ఫిబ్రవరి 19 న విజయలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆయన చేపట్టిన పదవులు
1998లో 12వ లోక్ సభ స్థానానికి మొదటిసారి ఎన్నికయ్యారు.
కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర మండలి, ఆంధ్రప్రదేశ్.
సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ).
1998-99లలో సభ్యులు, మానవ వనరుల అభివృద్ధి కమిటీ ఔషధ ధర నియంత్రణ దాని ఉప కమిటీ.
సభ్యులు, సలహా కార్యవర్గ సమితి, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
2004లో 14వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నికయ్యారు.
సభ్యులు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హౌస్ కమిటీ, సలహా కార్యవర్గ సమితి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.
కార్యదర్శి, జాతీయ సమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీ.
కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్, భారత కమ్యూనిస్ట్ పార్టీ.
సభ్యులు, వక్ఫ్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ
చైర్మన్, కార్మికస్థాయీ సంఘం