జాతీయంహోమ్

తీసేసిన ఓటర్ల పేర్లు ప్రకటించిన ఎన్నికల సంఘం

#ElectionCommissionOfIndia

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. తొలగించిన పేర్ల వివరాలను ఆగస్టు 19 లోగా ప్రజలకు అందుబాటులో ఉంచి, ఆగస్టు 22 నాటికి దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ చర్య చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం పోలింగ్ బూత్‌ల వారీగా ‘ASD’ (Absentee, Shifted, Dead) గైర్హాజరు, మారిన వారు, మరణించిన వారు) ఓటర్ల పేర్లను ప్రకటిస్తోంది. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వాటిని ఆన్‌లైన్‌లో కూడా ఉంచే అవకాశముందని వారు తెలిపారు. బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) తెలిపిన వివరాల ప్రకారం, రోహ్తాస్, బేగుసరాయ్, అరవల్ మరియు ఇతర ప్రదేశాలలో పోలింగ్ బూత్‌ల వద్ద ASD జాబితాలు ప్రదర్శించబడ్డాయి.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

Satyam News

మొంథా తుఫాన్ నేపథ్యంలో సహకరించండి

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు

Satyam News

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్

Satyam News

మమతా బెనర్జీ పాలనపై మోడీ తీవ్ర విమర్శలు…

Satyam News

Leave a Comment