వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి నందమూరి బాలకృష్ణ కి ‘ఇన్‌క్లూజన్ లెటర్’ వచ్చింది. భారతీయ సినిమాకు 50 సంవత్సరాలుగా హీరోగా ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది.
గత 50 సంవత్సరాలుగా బాలకృష్ణ ఒక ప్రముఖ హీరోగా, భారతీయ సినిమాకు చేసిన అసాధారణ కృషిని ఈ లేఖ ప్రశంసించింది. ఆయన అంకితభావం, ప్రతిభ, చిత్ర పరిశ్రమలో ఆయనకున్న స్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చాయని తెలిపింది.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చైర్మన్‌గా 15 సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలను కూడా ఈ లేఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
భారతీయ సినిమా, ప్రజా జీవితానికి ఆయన చేసిన కృషి పట్టుదల, నాయకత్వం, సాంస్కృతిక సుసంపన్నతకు అద్దం పడుతుందని కొనియాడింది.ఆయన అసాధారణ విజయాలకు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా ఆయన వారసత్వాన్ని గౌరవించటానికి ఎదురు చూస్తున్నట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలిపింది.