మాజీ ముఖ్యమంత్రి జగన్ మరొక్క సారి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. పొగాకు రైతుల పేరుతో, మిర్చి రైతుల పేరుతో, బెట్టింగ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణ పేరుతో ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసులకు సవాల్ విసిరిన జగన్ ఈ సారి తిరుమల కొండపై రచ్చ రచ్చ చేసేందుకు బయలుదేరుతున్నారు.
ఈనెల 27న జగన్ తిరుమల పర్యటన ఖరారైందని అంటున్నారు. అన్యమతస్థుడైన జగన్ ఇప్పటి వరకూ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు. డిక్లరేషన్ అడిగినా కానీ అధికార బలంతో దాన్ని పక్కకు నెట్టి వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు. తిరుమల పర్యటన లో గతంలో ప్రతిపక్షంలోను, ముఖ్యమంత్రి హోదాలో వున్నాఎప్పుడూ డెక్లరేషన్ పై జగన్ సంతకం పెట్టలేదు.
ఇప్పుడు తాజా పర్యటనలో కూడా డిక్లరేషన్ పై జగన్ సంతకం చేస్తాడా !వివాదం చేస్తాడా! అనేది ఆసక్తికరంగా మారింది. డెక్లరేషన్ పై సంతకం చేసి దర్శనానికి వెళ్తాడా ! అనే అనుమానాల మధ్య డెక్లరేషన్ పై సంతకం లేకుండా జగన్ ను దర్శనానికి అనుమతించబోమని టిటిడి అంటున్నది. టిటిడి నియమ నిబంధనలు ప్రకారం జగన్ సంతకం చేయాల్సిందే అని టిటిడి అధికారులు అంటున్నారు.
జగన్ అన్యమతస్తుడు కావడంతో నే డెక్లరేషన్ ను టిటిడి కోరనున్నది. టిటిడి నియమనిబంధనలు అన్యమతస్తులు ఎవ్వరైనా సరే సంతకం చేయాల్సిందే. దేవుడు పై నమ్మకం ఉంటే సంతకం పెట్టి తీరాలని భక్తజనం అంటున్నారు. అన్య మతాలకు చెందిన ప్రముఖలు ఎవ్వరు వచ్చినా సంతకం చేసి దర్శనానికి వెళ్ళుతున్నారు. జగన్ గానీ, గతంలో ఆయన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డిగానీ క్రైస్తవుల అయినా కూడా సంతకం పెట్టకుండానే ఇంత కాలం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
డెక్లరేషన్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తామని ఈ సారి టీటీడీ స్పష్టం చేసింది. గత కొద్ది రోజులుగా తిరుమల ను జగన్ టార్గెట్ గా చేసుకున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా చిన్న సంఘటనలను భూతద్దం లో చూపించే విధంగా సొంత మీడియాలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.
గతంలో రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేసిన తర్వాత అక్షింతలు తలపై దులిపేసుకున్న జగన్ విడియో అప్పట్లో వైరల్ అయింది.