జాతీయంహోమ్

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

#RiniGeorge

అసభ్యకరమైన ప్రవర్తన ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మంఖూటతిల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. ఇప్పటికే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాహుల్ మంఖూటతిల్ రాజీనామా చేశారు.

అయినప్పటికీ నిరసనలు మిన్నంటడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మంఖూటతిల్‌పై వచ్చిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నిరసనలు చేపట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

ఆదివారం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) యువజన విభాగం అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) పాలక్కాడ్‌లో భారీ నిరసన మార్చ్ నిర్వహించింది. ఇంతకుముందు గురువారం కాంగ్రెస్ నేత, కేరళ ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ మాట్లాడుతూ పార్టీ ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటుందని, ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు.

ఆయన మాట్లాడుతూ “ఆరోపణల తీవ్రతను పరిశీలిస్తాం. అవి తీవ్రంగా ఉంటే తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. విధి విధానాల ప్రకారం ఆయనకు తన వాదన చెప్పే అవకాశం ఇస్తాం. ఆలస్యం లేకుండా నిర్ణయం తీసుకుంటాం. పార్టీకి నేరుగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కానీ ఎవరు ఆరోపణలు చేసినా వాటిని సీరియస్ గానే పరిశీలిస్తాం. సరైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం” అని పేర్కొన్నారు.

మలయాళ నటి రిని జార్జ్ ఒక యువనేత తనపై అనుచిత ప్రవర్తన చేశాడని ఆరోపించగా, పేరు ప్రస్తావించకపోయినా బీజేపీ నేరుగా రాహుల్ మంఖూటతిల్‌ను ఈ ఆరోపణలకు కారకుడిగా పేర్కొన్నది. అదేవిధంగా, ట్రాన్స్-వుమన్ కార్యకర్త అవంతిక కూడా రాహుల్ మంఖూటతిల్ తనకు “లైంగికంగా అసభ్యకరమైన” సందేశాలు పంపాడని ఆరోపించారు.

Related posts

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన నటి సుధ

Satyam News

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

Satyam News

కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు

Satyam News

ఇథనాల్ శాతాన్ని ఇప్పటిలో పెంచేదిలేదు…

Satyam News

కల్తీ లడ్డులో మరో 11 మంది నిందితులు

Satyam News

అమిత్ షా సమాధానం చెప్పాల్సిందే: విపక్షాల పట్టు

Satyam News

Leave a Comment