భూమన కరుణాకర్ రెడ్డిని వైకాపా, సాక్షి బహిష్కరించిందా? ఈరోజు సాక్షి పత్రిక మొత్తం చూసినా, తిరుపతి జిల్లా ఎడిషన్ వెతికినా ఎక్కడా నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్షిని ఉద్దేశించి మాట్లాడిన వివాదాస్పద వాక్యలు ప్రచురించలేదు. వైకాపా సోషల్మీడియా అఫీషియల్ పేజీలలో కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు.
మొట్ట మొదటిసారిగా భూమన కరుణాకర్ రెడ్డి వాఖ్యలను దాచేసింది, మింగేసింది వైకాపా, సాక్షి. ఎందుకంటారు? అదే షర్మిళ మీద, సునీత మీద పులివెందులలో క్రిమినల్స్, కోన్కిష్కా గొట్టాలు మాట్లాడినా ప్రసారం చేసి, అచ్చేసే.. సాక్షి, వైకాపా.. శ్రీలక్ష్మి మీద తిరుపతిలో వుండే తమ సంధింటి వారసుడిలా భావించే భూమన కరుణాకర్ రెడ్డి వివాస్పద వాఖ్యల మీద ఎందుకు మౌనం వహించారు?
ఆఖరికి తమ సహచర బులుగు మీడియాలో వచ్చినా.. మిత్రుల నమస్తే తెలంగాణ మీడియాలో వచ్చినా.. వైకాపా, సాక్షి ఎందుకు సెన్సార్ చేసింది? వ్రాస్తే.. వినిపిస్తే 11 విగ్గులను ఎడిటింగ్ చెయ్యాలనా.. లేదా శ్రీలక్ష్మిని తిరుపతి నుండి అలా బెదిరించి, ఇటు తాడేపల్లి నుండి మళ్లీ సర్దిచెప్పి, కలిసిచేసిన పాత, కొత్త అవినీతి పనుల గురించి ఎవరూ నోరు విప్పకూడదు అని ఒప్పించవచ్చు అని తాత్కాలికంగా విరామం ఇచ్చిందా?
టీడీఆర్ బాండ్లలో అవినీతి జరగలేదని, అతి తక్కువగా జరిగిందని మాత్రమే మంత్రి నారాయణ చెప్పారని ఆనందిస్తూ.. ఆవు వ్యాసం వ్రాసి, అందులో కరుణాకర్ రెడ్డి పేరు మాటమాత్రంగా కూడా ప్రస్తావించకుండా.. తిరుపతి జిల్లా ఎడిషన్లో అంత జాగ్రత్తపడడం వెనుక ఏమి జరిగింది?
తాత్కాలికంగా కరుణాకర్ రెడ్డి మాటలను వేలేశారా? లేదా శాశ్వతంగా కొనసాగిస్తారా? స్వామి వారి పాదాల తిరుపతిలో ఆధ్యాత్మికతకు బదులు, భూమన అబద్దాలే ఎక్కువ వినబడుతుంటాయి.
రాజారెడ్డి వ్యవస్థాపక ముఠాలో సభ్యుడైన విజయసాయిరెడ్డిని తప్పించినట్లు, మరో ముఖ్య సభ్యుడు మరియు వైఎస్ రాజశేఖరరెడ్డి లెక్కన చేతులు తిప్పుతూ మాట్లాడే.. భూమన కరుణాకర్ రెడ్డిని తప్పిస్తారా?
చూద్దాం.. ముందు ముందు ముఠా గూడుపుఠాణీ గమనాన్ని.