ప్రపంచం హోమ్

మోడీ పై ‘వార్’ మొదలు పెట్టిన డోనాల్డ్ ట్రంప్

#PeterNavarro

తాను విధించిన సుంకాలకు భారత్ లొంగక పోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాటల యుద్ధానికి దిగారు. ఈ క్రమంలోనే వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారుడు దారుణమై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్ యుద్ధాన్ని “మోదీ యుద్ధం”గా వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో అభివర్ణించాడు.

ఉక్రెయిన్ ఘర్షణను “మోదీ యుద్ధం”గా అభివర్ణిస్తూ వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. రష్యా చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందువల్లే మాస్కోకు సైనిక ఆధిక్యం వస్తోందని, దీంతో అమెరికన్ పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు.

“మోదీ గొప్ప నాయకుడు. ఇది పరిపక్వమైన ప్రజాస్వామ్యం. కానీ భారత్‌కి ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు ఉన్నాయని వాస్తవం తెలిసినా, అవి లేవని మాకు ఎదురు చెబుతున్నారు” అని ఆయన అన్నారు. భారత్‌ రష్యా నుండి చమురును తక్కువ ధరకే కొనుగోలు చేసి, దాన్ని శుద్ధి చేసి అధిక ధరకే తిరిగి అమ్ముతుందని, ఆ డబ్బుతో రష్యా తన యుద్ధ యంత్రాన్ని నడిపించి ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోందని నవారో ఆరోపించారు.

“దీని ఫలితంగా అమెరికన్లు  వినియోగదారులు, వ్యాపారులు, కార్మికులు అందరూ నష్టపోతున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులే ఎక్కువగా నష్టపోతున్నారు. చివరికి మేమే మోదీ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నామన్నమాట” అని ఆయన అన్నారు.

తన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలో, రష్యా చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేస్తే, అమెరికా భారతీయ వస్తువులపై సుంకాలను 25 శాతం తగ్గించవచ్చని సూచించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత విధానాలు మాస్కోకు మరింత బలాన్నిస్తాయని హెచ్చరించారు.

“ఇది మోదీ యుద్ధమే. ఎందుకంటే శాంతి మార్గం కొంతమేర న్యూ ఢిల్లీ ద్వారానే సాగుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా అమెరికా, భారత్‌ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. వాణిజ్య అసమానతలు, మాస్కోతో న్యూ ఢిల్లీ ఇంధన సంబంధాలు కారణంగా అమెరికా భారత ఎగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచగా, చర్చలు నిలిచిపోయాయి.

ఇదే సమయంలో భారత్‌ మాత్రం రష్యా నుండి చమురు దిగుమతులు చౌకదనం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని వాదిస్తోంది. అమెరికా, యూరప్ దేశాలు రష్యా సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తూనే ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌పై నైతికంగా విమర్శలు చేయడం సరికాదని భారత అధికారులు చెబుతున్నారు.

Related posts

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News

ఆర్థిక నేరం కేసులో రమేష్ అరెస్ట్

Satyam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత?

Satyam News

Leave a Comment

error: Content is protected !!