గాజువాక జింక్ రోడ్డులో కారు దగ్ధమైంది. కారును స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ నుంచి మంటలు రావడంతో సదరు వ్యక్తి కిందకి దిగిపోయాడు. చూస్తుండగానే కారు మొత్తం మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
previous post