తెలుగుదేశం పార్టీ కోటిమంది సభ్యులుగల అతిపెద్ద కుటుంబం. ఎవరు ఏస్థాయి పదవుల్లో ఉన్నా అధినేతలను కుటుంబ పెద్దల్లా గౌరవించడం సాంప్రదాయంగా వస్తోంది. విశాఖ నోవాటెల్ లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో పదవులను పక్కనబెట్టి ఆత్మీయతను చాటుకున్నారు నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు.
ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సదస్సులో చివరిగా మాట్లాడాల్సి ఉండగా, అంతకుముందుగా మంత్రి లోకేష్ ప్రసంగించడానికి ఉపక్రమించారు. అన్నా ముందు నేను మాట్లాడతాను అంటూ రామ్మోహన్ నాయుడు తమస్థానం నుంచి పైకి లేచారు. వెంటనే లోకేష్ వారిస్తూ… వద్దు రాము… ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న నువ్వు చివరగా మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతానంటూ లోకేష్ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. పదవులను పక్కనబెట్టి అన్నదమ్ముల్లా వారిద్దరి మధ్య సాగిన ఈ సరదా సంభాషణ సభకు విచ్చేసిన ప్రముఖులను అలరించింది.
