ముఖ్యంశాలు హోమ్

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

కడప జిల్లా లో ఎర్ర చందనం స్మగ్లర్ల వేట కొనసాగుతున్నది. తాజాగా కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. చాపాడు పోలీసులు జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దస్తగిరి రెడ్డి పై రెండు సార్లు పిడి యాక్టు తో పాటు 86 ఎర్రచందనం రవాణా కేసులతో పాటు 34 దొంగతనం కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడి అయింది. ఇతనితో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 1 టన్ను బరువుగల 52 ఎర్రచందనం దుంగలు, రవాణాను ఉపయోగించిన 2 కార్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. ఈ వివరాలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.

Related posts

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా?

Satyam News

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

Satyam News

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్టీఏ అభ్యర్ధి ఖరారు

Satyam News

Leave a Comment

error: Content is protected !!