తూర్పుగోదావరి హోమ్

ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం

#Kakinada

ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నగరంలో నూరుశాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యమని కాకినాడ కమిషనర్ భావన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్‌లో 463 మంది వాలంటీర్ టీచర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.

వీరు మొదటి విడతలో ఎంపికైన 4,634 మంది నిరక్షరాస్యులకు విద్య అందించనున్నారు. విద్యను ఏ విధంగా బోధించాలో ఈ శిక్షణలో వాలంటీర్లకు మెలకువలు అందించారు. టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్  కె. శైలజ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “నగరాన్ని నూరు శాతం అక్షరాస్యుల నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఈ లక్ష్యం సాధనలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలి” అన్నారు.

వయోజన విద్యా శాఖ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ, “ప్రతి వాలంటీర్ రోజుకు ఒక గంటపాటు సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య వయోజనులకు చదువు బోధించాలి” అని సూచించారు. కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి. వెంకటరాజు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా నారా దేవాన్ష్

Satyam News

Leave a Comment

error: Content is protected !!