మహబూబ్ నగర్ హోమ్

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

#EycCamp

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్  గార్డెన్ లో  యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ ఆధ్వర్యంలో నారాయణపేట లైన్స్ క్లబ్, హైదరాబాద్ మలక్ పేట్ యశోద ఆస్పత్రి, శ్రీ నేత్రా ఆస్పత్రి సనత్ నగర్ సహకారంతో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం విజయవంతమైంది.

ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా శిబిరంలో దాదాపు 300 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో వైద్య పరీక్షలతోపాటు హెల్త్ కార్డులు లేని 20 మంది జర్నలిస్టులకు యూనియన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులను అందజేశారు.

కాగా యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చిన జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నారాయణపేట లైన్స్ క్లబ్ సభ్యులు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ రషీద్, టీయూడబ్ల్యూజే ఐ జే యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోయిలకొండ నారాయణరెడ్డి, శివశంకర్, యూనియన్ హెల్త్ కన్వీనర్ గద్వాల సంజీవ్ ప్రకాశ్,  సభ్యులు నక్క శ్రీనివాస్, గణప రఘు, రాజేష్ కుమార్, సులిగం సురేష్ కుమార్, లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ హరి నారాయణ బట్టాడ్, పట్టణ  అధ్యక్షుడు రవికుమార్ గౌడ్, సభ్యులు కన్న జగదీష్, శ్రీనివాస్ లాహోటి, సాయికుమార్, ఎస్ ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సునీతకు తీరని అన్యాయం చేసిన జగన్

Satyam News

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్థన్‌ రాజు

Satyam News

సంచలనం రేపుతున్న ప్రకాశ్ రాజ్ ట్వీట్

Satyam News

Leave a Comment

error: Content is protected !!