ప్రత్యేకం హోమ్

నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అరుదైన ప్రశంస!

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రత్యేక సందర్శన కార్యక్రమం’ (Special Visits Program – SVP)లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా నాయకులను గుర్తించి, వారితో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించేందుకు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ ఈ అత్యున్నత దౌత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వుంటుంది.

గత సంవత్సర కాలంలో ప్రభుత్వంలో లోకేష్‌ నాయకత్వం, అలాగే రాష్ట్రంలో మానవ వనరులు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఆయన ప్రతిష్ఠాత్మక ప్రణాళికలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసించింది. ఈ లక్ష్యాలను సాధించడంలో ఆస్ట్రేలియా సహజ భాగస్వామిగా ఉంటుందని ఆ ఆహ్వాన లేఖలో స్పష్టం చేసింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2001లో ఇదే SVP కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి చారిత్రక ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, లోకేష్‌కు ఆస్ట్రేలియా పంపిన ఈ ఆహ్వానం గొప్ప విషయం.

నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన ప్రాధాన్యతల ఆధారంగా ఆస్ట్రేలియాలోని విద్యా రంగం, నైపుణ్యాభివృద్ధి నిపుణులు, పెట్టుబడిదారులు, ఆక్వాకల్చర్ మరియు మౌలిక సదుపాయాల రంగ నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆస్ట్రేలియా, ఆంధ్రా మధ్య దీర్ఘకాలిక ఆర్థిక, పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలు, సంబంధాలకు ఒక వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు.

Related posts

ఉత్తరాంధ్ర భారీవర్షాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Satyam News

అక్షరం నుంచి ఆకాశమంత – గురు దీవెన

Satyam News

వార్ రూమ్ నుంచి మరువలేని సాయం

Satyam News

Leave a Comment

error: Content is protected !!