వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెవులు దద్దరిల్లేలా, తాడేపల్లి ప్యాలెస్‌లో జయహో విజయవాడ నినాదాలు మార్మోగేలా చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి ఉరితాడు వేలాడేలా చేశాడు జగన్.. రైతుల దగ్గర నుండి సేకరించిన 33 వేల ఎకరాల భూమిలో చిన్న అభివృద్ధి చేపట్టలేదు.. విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని తగ్గించేలా జగన్ చేయని సంతకం లేదు.. చేపట్టని చర్యలు లేవు.. జగన్ నిర్ణయాలతో ఇటు అమరావతి, అటు విజయవాడ ఇమేజ్ డ్యామేజ్ అయింది.. తాజాగా, కూటమి సర్కార్.. విజయవాడ బ్రాండ్‌ని దేశవ్యాప్తం చేసేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది..
దసరా ఉత్సవాలు అంటే మైసూర్ గుర్తుకువస్తుంది.. నవరాత్రుల సందర్భంగా మైసూర్‌లో చేపట్టే అనేక కార్యక్రమాలని వీక్షించడానికి వేలాది మంది భక్తులు, పర్యాటకులు అక్కడికి విచ్చేస్తారు.. ఇక, దసరా అంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి లక్షలాది మంది భక్తులు క్యూ కడతారు. కొండపైన అమ్మవారిని దర్శించుకొని, ఆమెని ప్రసన్నం చేసుకోవాలని ఆకాంక్షిస్తారు.. సరిగ్గా ఈ వేడుకలనే టార్గెట్ చేసుకొని విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని పదింతలు చేసేందుకు సన్నద్ధం అవుతోంది కూటమి సర్కార్.. నవరాత్రుల సమయంలో ఏకంగా 10 లక్షలమందికిపైగా భక్తులు, పర్యాటకులు విజయవాడ సందర్శిస్తారని అంచనాలున్నాయి.. వారిని కేవలం అమ్మవారి ఆలయ దర్శనానికే పరిమితం కాకుండా వినోద కార్యక్రమాలు, పర్యాటక ఉత్సవాలు నిర్వహించి విజయవాడ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు..
దేవీ నవరాత్రుల కానుకగా విజయవాడ ఉత్సవ్ ని ఘనంగా నిర్వహించనుంది కూటమి సర్కార్.. దీనికోసం పది రోజుల పాటు అనేక వేడుకలను ప్లాన్ చేసింది.. విజయవాడలో 2కే, 5కే, 20కే మారధాన్ రన్‌లను నిర్వహించనున్నారు.. ఇటు, కృష్ణా నదిలో పడవ పోటీలను ఏర్పాటు చేస్తున్నారు.. విజయవాడలోని పలు చోట్ల ఫుడ్ ఉత్సవాలు, సంప్రదాయ ఆచార వ్యవహారాలను పరిచయం చేసే కార్యక్రమాలను నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు అధికారులు..
మరోవైపు, ఇదే సమయంలో పలు సినిమా ఈవెంట్లు అక్కడ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని విజయవాడలో నిర్వహించడానికి సిద్ధం అయింది సినిమా యూనిట్.. ఇటు, విడుదలకు రెడీ అవుతోన్న బాలయ్య – బోయపాటి మూవీ అఖండ 2 ట్రయిలర్ రిలీజ్‌ని బెజవాడలో చేయాలని డేట్ ఫిక్స్ చేస్తున్నారు నిర్మాతలు.. ఇక, మెగాస్టార్ చిరంజీవి – విక్టరీకి కేరాఫ్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ పాటలని విజయవాడలోనే తొలిసారిగా వినిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. వీటితోపాటు పలు సినిమాల ఈవెంట్లు కూడా దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిపేలా పలువురు దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు..
వీటి అన్నింటితో విజయవాడ కొత్త శోభను సంతరించుకోనుంది.. ఈ కార్యక్రమాలతో విజయవాడతోపాటు తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ దద్దరిల్లనుందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. అమరావతి, విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌లని చెరిపేసేలా జగన్ చేపట్టిన చర్యలకు కూటమి సర్కార్ కౌంటర్ వ్యూహాలను రచిస్తోంది.. దేశవ్యాప్తంగా ఏపీ రాజధాని పేరు మార్మోగేలా చర్యలు చేపడుతోంది.