కృష్ణ హోమ్

ఆపరేషన్ నేపాల్ రెస్క్యూ: సక్సెస్ చేసిన లోకేష్

#OperationNepal

నేపాల్ లో చిక్కుకు పోయిన ఆంధ్రప్రదేశ్ వాసులు మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది తెలుగు వారు బయలు దేరారు.

ఖాట్మాండూ నుంచి మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం చేరుకున్నది. అనంతరం తిరుపతి విమానాశ్రయానికి ఆ ప్రత్యేక విమానం చేరుకుంటుంది. విశాఖకు 104 మంది ఏపీ వాసులు, మరో 40 మంది తిరుపతికి చేరుకుంటారు. కూటమి ప్రభుత్వం ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

అదే విధంగా విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగు వారికి స్వాగతం పలికేందుకు కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆయా విమానాశ్రయాల నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తూనే ఉననారు. నేపాల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు కృషిచేసిన నారా లోకేష్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

Satyam News

హనుమాన్ విగ్రహంపై దారుణ వ్యాఖ్యలతో వివాదం

Satyam News

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

Leave a Comment

error: Content is protected !!