విశ్వ ఆయుర్వేద పరిషద్ తెలంగాణ విభాగం వారు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆయుర్వేద విజ్ఞాన సదస్సు కు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో అయన ప్రసంగిస్తూ ఆయుర్వేదం వైద్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు.
ఇతర వైద్య విధానాలు గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయుర్వేద మందుల గురించి సైన్టిఫిక్ గా పరిశోనాత్మక నిరూపణలు అడుగుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో పథకాలను అమలులోకి తీసుకొస్తుంది.
ప్రతి జిల్లాకు 50 పడకల ఆయుర్వేద హాస్పిటల్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. సారంగ పాణి, ప్రెసిడెంట్ విశ్వ ఆయుర్వేద పరిషద్ తెలంగాణా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ను (AIIA) ప్రారంభించవలసినదిగా కోరారు.
దక్షిణ భారత దేశానికి దీని ఆవశ్యకత గురించి వివరంగా తెలిపారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి కి డా. ప్రేమా నంద్ రావు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ డా. సారంగ పాణి, డా కిషన్ సెక్రటరీ వినతి పత్రం సమర్పించారు.