ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డిని తన వ్యక్తిగత కార్యాలయంలో శనివారం డిగ్రీ కళాశాల విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజు కట్టే వరకు పరీక్షలు రాయనిచ్చేది లేదని చెప్పడంతో విద్యార్థులు తమ సమస్యను ఎమ్మెల్యేకు తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే కాలేజీ యాజమాన్యాలను పిలిపించి విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కేవలం పరీక్ష ఫీజు మాత్రమే కట్టించుకోవాలని వారికి తెలిపారు. అతి త్వరలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేస్తుందని సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
previous post
next post