సినిమా హోమ్

50 ఏళ్ల తర్వాత కలిసిన “లక్ష్మణరేఖ” జంట

గోపాలకృష్ణ దర్శకత్వంలో మురళీమోహన్ – జయసుధ జంటగా నటించిన “లక్ష్మణ రేఖ” చిత్రం విడుదలై 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు. చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్, జయసుధలతోపాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేసిన రాజేంద్రప్రసాద్ లను ఆత్మీయంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వీరంతా 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి, అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. క్రమశిక్షణ, అంకితభావాలను లక్ష్మణరేఖలుగా మలచుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు రామసత్యనారాయణను అభినందించారు.

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో సీనియర్ దర్శకులు ధవళ సత్యం, పి.ఎన్. రామచంద్రరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, ఫిలిం నగర్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కాజా సూర్యనారాయణ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు సురేష్ కొండేటి, ధీరజ అప్పాజీ పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు పుత్రోత్సాహం… లోకేష్‌ ఫుల్‌ ఖుషీ

Satyam News

గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

Satyam News

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ మీటింగ్

Satyam News

Leave a Comment

error: Content is protected !!