మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అర్హత కలిగిన రైతులు అందరికీ ఉచితంగా ఉద్యానవన అభివృద్ధిలో భాగంగా మొక్కలు పంపిణి చేస్తుందని రంపచోడవరం డ్వామా ఏపీడి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. క్షేత్రస్థాయి పరిశీనాలో భాగంగా విశ్వనాధ్ మారేడుమిల్లి పంచాయతీ కొత్త కాలనీ రైతుల పొలాలను పరిశీలించి హార్టికల్చర్ అభివృద్ధిలో భాగంగా డ్వామా ద్వారా ఇచ్చిన మొక్కలను పరిశీలించి కొంత మంది రైతులతో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఎ పి డి విశ్వనాధ్ మాట్లాడుతూ మారేడుమిల్లి మండలంలో 2025 – 2026 ఆర్ధిక సంవత్సరానికి గాను సుమారు 750 ఎకరాలలో దబ్బా, కొబ్బరి, నిమ్మ, జఫ్రా, మామిడి తదితర ఉధ్యావన పంటలు అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నకుమారి, ఏపీఓ దసరా మణి కుమారి, జేఈ బర్ల శ్రీమివాస్, టెక్నికల్ అసిస్టెంట్ రామి రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.
