నావికాదళ ఆధునీకరణను వేగవంతం చేస్తూ భారత నావికాదళం రెండు అధునాతన ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్‌లు – ఉదయగిరి (F35) మరియు హిమగిరి (F34) లను ఆగస్టు 26న విశాఖపట్నంలో – ఏకకాలంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉదయగిరి (F35), ఐఎన్‌ఎస్ హిమగిరి (F34) అనే ఈ రెండు ప్రధాన ఉపరితల యుద్ధ నౌకలు. వేరే వేరే భారతీయ షిప్‌యార్డులు నిర్మించిన రెండు ప్రధాన ఉపరితల యుద్ధ నౌకలను ఒకేసారి సేవలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ప్రాజెక్ట్ 17ఏ తరగతిలో రెండవ నౌకగా ముంబైలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) తయారు చేసింది.
ఐఎన్‌ఎస్ హిమగిరి అయితే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజినీర్లు (GRSE) నిర్మించిన తొలి P17A ఫ్రిగేట్. “ఇది రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాల విజయాన్ని ప్రతిబింబిస్తుంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయగిరి అనేది MDL నుండి వచ్చిన రెండవ P17A ఫ్రిగేట్ కాగా, హిమగిరి GRSE నిర్మించిన తొలి నౌక. ముఖ్యంగా, ఉదయగిరి భారత నౌకాదళ యుద్ధ నౌకల రూపకల్పన విభాగం రూపొందించిన 100వ నౌక కూడా కావడం గమనార్హం. సుమారు 6,700 టన్నుల స్థూల బరువు కలిగిన ఈ P17A ఫ్రిగేట్‌లు, శివాలిక్ తరగతితో పోలిస్తే ఐదు శాతం ఎక్కువ పరిమాణం కలిగి ఉండేలా రూపొందించబడ్డాయి. ఇవి తగ్గించిన రాడార్ గుర్తింపు గల స్లీక్ హల్ డిజైన్‌తో రూపొందించబడి, డీజిల్ లేదా గ్యాస్ (CODOG) శక్తితో నడిచే ఇంజిన్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫాం మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడతాయి.
ఈ నౌకలు సూపర్‌సోనిక్ సర్పేస్-టు-సర్పేస్ క్షిపణులు, మీడియం-రేంజ్ సర్పేస్-టు-ఎయిర్ మిసైళ్లతో పాటు 76 మిల్లీమీటర్ల గన్, క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్‌లు, యాంటీ-సబ్‌మెరిన్ ఆయుధాలను కలిగి ఉంటాయి. ఇవి 200 కంటే ఎక్కువ మైక్రో, స్మాల్, మిడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEs) సహకారంతో నిర్మించబడి, సుమారు 4,000 ప్రత్యక్ష, 10,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టించాయి. రెండు నౌకలు హల్ పనితీరు, ప్రొపల్షన్, ఫైర్‌ఫైటింగ్, నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై సముద్ర పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి.
ఈ ఆవిష్కరణ కార్యక్రమం స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణాన్ని పెంపొందించేందుకు భారత్ చేపట్టిన చర్యలలో భాగంగా నిర్వహించబడుతోంది. ఇది విదేశీ సరఫరాదారులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు భారత మహాసముద్ర ప్రాంతంలో నౌకాదళ సామర్థ్యాలను బలోపేతం చేయడానికై తీసుకున్న కీలక చర్య. 2025లో INS సూరత్ డిస్ట్రాయర్, INS నీలగిరి ఫ్రిగేట్, INS వాఘ్‌షీర్ సబ్‌మెరిన్, INS అర్నాలా యాంటీ-సబ్‌మెరిన్ నౌక, INS నిస్టర్ డైవింగ్ సపోర్ట్ వెసెల్ వంటి అనేక స్వదేశీ నౌకలు కూడా సేవలోకి ప్రవేశించాయి.