సినిమా హోమ్

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

క్రైమ్, రాజకీయ వికృత చిత్రాలు తీసి డబ్బు వెనకేసుకున్న రామ్ గోపాల్ వర్మను ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా కేసు పెట్టారు. దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్‌ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా సిన్హా ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘దహనం’ వెబ్‌సిరిస్‌కు నిర్మాతగా రామ్‌గోపాల్‌వర్మ.

2022లో దహనం వెబ్ సీరిస్ వచ్చింది. మొదట ఎంఎక్స్ ప్లేయర్ ‌లో విడుదలైంది. అయితే తరువాత తొలగించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్, ఒక కమ్యూనిస్ట్ కార్మికుడి హత్య అనంతరం ప్రతీకార కథ చుట్టూ తిరుగుతుంది. 1990 బ్యాచ్‌కు చెందిన అంజన తెలుగు రాష్ట్రాల్లో ADGP హోదా వరకూ ఉన్నారు. రాయలసీమలో ఎస్పీగా, DIGగా పనిచేశారు అంజనా సిన్హా వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్‌సిరీస్‌లో ఉపయోగించారు. ప్రస్తుతం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ డైరక్టర్ గా ఉన్నారు.

ఆ దహనం వెబ్ సిరీస్ నిర్మాత, దర్శకుడిని ఎప్పుడూ కలవలేదు. మాట్లాడలేదు. ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదు. నా పేరుతో, నా ప్రొఫెషనల్ ఐడెంటిటీతో ఈ సిరీస్‌ను నరేట్ చేసినట్లు చూపించడం ద్వారా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు.ఈ సిరిస్‌ మొత్తం హింసాత్మక దృశ్యాలు, సెక్సువల్ కంటెంట్ ఉంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి తన ప్రతిష్ట, గౌరవం, ప్రొఫెషనల్ స్టాండింగ్‌కు తీవ్ర నష్టం కలిగించాయని తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని, మానసికంగానూ కలత చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు సెప్టెంబర్ 10న నిర్మాత, దర్శకుడిపై ఐపీసీ సెక్షన్లు 509, 468, 469, 500, 120(B) కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే ఏపీలో ఆయనపై పలు కేసులు ఉన్నాయి.

Related posts

డెమోగ్రఫీ మిషన్ ప్రారంభిస్తున్నాం…

Satyam News

కలలకు సహకరించిన కుంచె

Satyam News

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!