అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే కు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో అసైన్డ్ అని ప్రభుత్వం పేర్కొన్నది. రిటర్నబుల్ ప్లాట్ ల పత్రాలపై అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్ లు అమ్ముడు పోవడం లేదని ప్రభుత్వానికి రైతులు తెలిపారు. అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్ల లో అసైన్డ్ అనే పదం తీసివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దాంతో ఈ మేరకు ఈ రోజు ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నంబర్ 187 ను విడుదల చేశారు.
previous post