ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) స్వదేశీ 4జీ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుండడం విశేషం. ఇది క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్ అని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు 5జీకి సులువుగా అప్‌గ్రేడ్ అవ్వొచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
సెప్టెంబర్ 27న బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా సుమారు 98 వేల సైట్లలో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి వివరించారు. పలు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభోత్సవం జరగనుందని చెప్పారు. ప్రధాని మోదీ ఒడిశాలోని జార్సుగుడా నుంచి ఈ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించనున్నారని తెలిపారు. గువాహటిలో జరిగే కార్యక్రమంలో మంత్రి సింధియా పాల్గొననున్నారు.