విజయనగరం జిల్లా 33వ జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ గా ఏ.ఆర్.దామోదర్ సోమవారం డీపీఓలోని ఎస్పీ ఛాంబర్ లో బాద్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన దామోదర్ విజయనగరం జిల్లా ఎస్పీగా రెండోసారి బాద్యతలు స్వీకరించారు. ఈ మేరకు డీపీఓలో ఏఆర్ సిబ్బంది నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. పూర్ణ కుంభంతో వేద ఆశ్వీరాదం తీసుకున్నారు.
ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దామోదర్ కు అడిషనల్ ఎస్పీ సౌమ్యలత,ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు,డీఎస్పీ శ్రీనివాస్,బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి,ఇలా పోలీస్ ఆపీసర్లందరూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దామోదర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా జిల్లా పోలీస్ అధికారులు రెండేసి నిమ్మకాలుల ఇచ్చి మరీ కొత్త ఎస్పీకి స్వాగతం చెప్పారు.
అనంతరం ఎస్పీ దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ గంజాయి రవాణకు విజయనగరం జిల్లా కేంద్రంగా తయారైందన్నారు.అటు ఒడిషా,ఇటు ఛత్తీస్ ఘడ్ లకు జిల్లా కేంద్రమే రవాణా మారిందన్నారు. ప్రభుత్వం కూడా ఈ గంజాయి నిర్మూలనపైనే దృష్టి పెట్టిందన్నారు. ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా దాన్ని అరికడతాన్నారు.
ఇక ఉమెన్ ఇష్యూస్,ఫోక్సో కేసులపై దృష్టి పెడతానన్నారను. సైబర్ వాడకం పైనా తన ఫోకస్ ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా పాత్రికేయుల సహాకారం తనకు అవసరమని జిల్లాలో పని చేసే అనుభవం ఉందని, అలాగే పొలిటికల్ గా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళతానని ఎస్పీ దామోదర్ స్పష్టం చేసారు.