శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ వన్యప్రాణాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు అతని వద్ద నుంచి అరుదైన వన్యప్రాణాలను గుర్తించారు. ప్రయాణికుడి వద్ద నుంచి ఒక మానిటర్ బల్లి, రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాలు, మరో 12 ఇగువానాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని తిరిగి బ్యాంకాక్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో సంబంధిత ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది.
previous post
next post