విజయనగరం లో మరో రైలు ప్రమాదం జరిగింది. నగరంలోని సంతకాల వంతెన వద్ద విశాఖ వైపు వెళ్లే మెయిన్ లైన్ లో అటువైపు వెళ్తున్న గూడ్స్ పట్టాలు తప్పడంతో మూడు వ్యాగన్లు డిరైల్మెంట్ అయ్యాయి ఈ ఉదయం 06.10 నిమిషాలకు జరగడంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. విజయనగరం రైల్వేస్టేషన్ లో వరుసగా ఈ ఘటన రెండవది. సహాయక చర్యర నిమిత్తం విజిలెన్స్, రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు పన్నెండు గంటలు అయితే గాని విశాఖ వైపు వెళ్లే రైళ్లు పునరుద్ధరణ జరగవని ఆర్పీఎఫ్ చెబుతోంది.
previous post