అక్కడ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్న 212 గుండెలు. ఇక్కడ వేగంగా స్పందిస్తున్న ప్రభుత్వం, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కదిలిన అధికార యంత్రాంగం. ప్రతి ప్రాణం తమకు ముఖ్యమేనని నిరూపించిన అత్యున్నత మానవత్వం ఇది. నేపాల్‌లో చెలరేగిన అల్లర్ల మధ్య చిక్కుకున్న మన తెలుగువారిని వెనక్కి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల గురించి తెలుసుకుంటే, ప్రతి తెలుగు గుండె ఉప్పొంగుతుంది.
విదేశాల్లో, అందులోనూ అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో మనవాళ్లు ఉన్నారన్న వార్త కలచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు – అందరూ క్షణక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ ఫోన్ కాల్స్ కోసం ఎదురుచూశారు. “ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ఎప్పుడు తిరిగి వస్తారు?” అన్న ప్రశ్నలు. ఆ ఆవేదన, ఆ అభద్రతా భావం పగవారికి కూడా రాకూడదు. కానీ, ఆ క్షణంలో ప్రభుత్వం చూపించిన చొరవ, చాటిన స్ఫూర్తి ఎంతోమంది గుండెల్లో ఆశను నింపింది.
మంత్రి లోకేష్ నేరుగా RTGS కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని, ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సమీక్ష ప్రారంభించారు. 212 మంది చిక్కుకున్న వారి వివరాలు, వారు ఉన్న ప్రాంతాల కోఆర్డినేట్‌లతో సహా నిమిషాల్లో సేకరించి, అత్యవసర ప్రణాళికను సిద్ధం చేశారు. కడప, నంద్యాల, మదనపల్లె, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు జిల్లాల నుండి వచ్చిన కుటుంబాలు, వ్యక్తులు అక్కడ ఉన్నారని గుర్తించారు.
ప్రధాన కార్యదర్శి స్వయంగా నేపాల్‌లోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వారి యోగక్షేమాలను అధికారులతో సమీక్షించారు. వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై నిశితంగా చర్చించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తో నిరంతర సంప్రదింపులు జరుపుతూ, తాజా అల్లర్ల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.
220 మంది ప్రయాణించగలిగే ఒక ప్రత్యేక విమానాన్ని విశాఖపట్నానికి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విమానం విశాఖపట్నం చేరుకున్న తర్వాత, వారిని వారి సొంత జిల్లాలకు సురక్షితంగా చేర్చడానికి జిల్లావారీగా డేటాను సిద్ధం చేయాలని లోకేష్ ఆదేశించారు. నేపాల్ రాయబార కార్యాలయం, ంఏఆతో నిరంతర సమన్వయం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లోని అధికారులను అప్రమత్తం చేశారు.
మంత్రులు, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు పనిచేస్తుండగా, మరోవైపు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చలపల్లి శ్రీనివాసరావు మరియు బండ్రెడ్డి రామకృష్ణ కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. వారు బాధితుల కుటుంబాలను సంప్రదించి, ప్రభుత్వానికి, వారికి మధ్య వారధిగా వ్యవహరించి, సమన్వయానికి తోడ్పడ్డారు.
ఈ ప్రయత్నంలో ఉన్నతాధికారులు చురుగ్గా పాల్గొని, శ్రమిస్తున్నారు.
ఈ ఘటన కేవలం ఒక రెస్క్యూ ఆపరేషన్ కాదు. ఇది ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఎంత అండగా ఉంటుందో చూపిన ఉదాహరణ. భయం, నిస్సహాయత కమ్ముకున్న వేళ, ఆశను నింపిన ఒక గొప్ప మానవతా దృశ్యం. ప్రతి తెలుగువాడి గుండెలోనూ భరోసా కల్పించిన చారిత్రక ఘట్టం. తెలుగువాడు ఎక్కడ ఆపదలో వున్నా.. గల్ఫ్ ఎడారులను సైతం జల్లెడపట్టి జన్మభూమిని చేరుకొనేలా ప్రతిసారీ లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం.