హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వాన కొంచెం తెరపిచ్చినా కూడా రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకున్న ప్రజలు రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తున్నది. కూకట్ పల్లి, కెపిహెచ్ బి కాలనీ, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, మూసాపేట్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరికొన్ని గంటలు నగర వ్యాప్తంగా భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంటి నుంచి ఎవరు బయటకు రావద్దని సూచిస్తున్నారు.
previous post
next post