వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్, ఆయన సోదరి వై.ఎస్.షర్మిల. ఏపీ సీఎం చంద్రబాబు రాహుల్ గాంధీతో హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారంటూ జగన్ వ్యాఖ్యలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హాట్‌లైన్ అంటూ జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న షర్మిల..మోదీతో జగన్ హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్‌గాంధీ దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారన్న షర్మిల..జగన్‌లాగా రాహుల్ మనుషులపైకి కార్లు ఎక్కించడం లేదంటూ ఎద్దేవా చేశారు.
జగన్ తీరు పచ్చకామెర్లు వచ్చినోడిలా ఉందంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు షర్మిల. తెరవెనుక బీజేపీతో జగన్ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు షర్మిల. తెర వెనుక పొత్తులకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు, రాహుల్ మధ్య ఎలాంటి హాట్ లైన్ లేదని తాను హామీ ఇస్తానన్న షర్మిల..మోదీతో ఎలాంటి హాట్ లైన్ లేదని జగన్ హామీ ఇవ్వగలరా అంటూ సవాల్ విసిరారు. మోదీ, అమిత్ షాతో హాట్ లైన్ టచ్ లేదని, దమ్ముంటే బైబిల్ మీద ప్రమాణం చేయాలని జగన్‌ను డిమాండ్ చేశారు షర్మిల.
జగన్‌ది నీతి మాలిన రాజకీయమంటూ ఫైర్ అయ్యారు షర్మిల. మోదీకి వంగివంగి దండాలు పెట్టారని, అధికారంలో ఉన్న నాడు కేంద్రంలో బీజేపీకి అన్ని రకాల సహకరించి, బిల్లులకు మద్దతిచ్చారని గుర్తు చేశారు. జగన్‌కు సభ్యత సంస్కారం ఏం లేవన్నారు షర్మిల. మాణిక్కం ఠాగూర్ విసిరిన సవాల్‌పై చర్చకు రాలేదంటేనే జగన్‌కు దమ్ము లేదని అర్థమవుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం బీజేపీకి వ్యతిరేకంగా పని చేశారని, కానీ జగన్ మాత్రం ఆ పార్టీకి బానిసత్వం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు షర్మిల. మీదో పార్టీ, నువ్వో నాయకుడివి అంటూ జగన్‌ను గంజిలో ఈగలా తీసిపడేశారు షర్మిల.