కనీసం ప్రతిపక్ష నేతగాని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను తన వ్యక్తిగత ఆస్తిలా భావిస్తున్నారని, అందుకే ఇటువంటి హెచ్చరికలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పులివెందులలో కూడా ధరావత్తు దక్కకపోయినా.. దమ్మిడీ బుద్ధి రాలేదని, ఆయన తీరు మారలేదని ఎద్దేవా చేస్తున్నారు.
“మళ్లీ జగన్ వచ్చే వరకు ఎవడూ టెండర్ వెయ్యకూడదు, ఏ పనీ చెయ్యకూడదు” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎవరైనా సరే టెండర్లు వేసినా, పనులు చేసినా వాటిని రద్దు చేస్తానని, డబ్బులు వెనక్కి తీసుకుంటానని హెచ్చరించడం ఆయన వైఖరిని స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
“మెడికల్ కాలేజీలు గట్రా అయితే కూల్చను కూడా కూల్చేస్తాడేమో!” అని ప్రజలు, పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లయితే తవ్వి పారేస్తారేమో అని భయపడుతున్నారు. ఈ జన్మలో ఇక జగన్ తిరిగి అధికారంలోకి రారని నమ్మి, ఆయన పార్టీ నేతలు సైతం కొత్త టెండర్లు వేయడం, వైన్ షాపులకు కూడా టెండర్లు వేయడం చూస్తుంటే, ఆయనను సొంత పార్టీ వారే నమ్మడం లేదని అర్థమవుతోంది.
జగన్ హెచ్చరికలు రోడ్డుపై వెళ్లే రౌడీ ఇచ్చే వార్నింగ్ లా ఉన్నాయని ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అతి త్వరలో జైలుకు వెళ్లబోయే ఈ వ్యక్తి ప్రవర్తన సైకోలా ఉందని, ఈ రుబాబు ఇంకెంత కాలం భరించాలో అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.