మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, ఒకనాటి హీరోయిన్ లావణ్య త్రిపాఠీ దంపతుల కుమారుని పేరును మెగా కుటుంబం ప్రకటించింది. సెప్టెంబర్ 10న ఉదయం లావణ్య త్రిపాఠి బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్బంగా దంపతులు తాజా ఫొటోలు పంచుకుంటూ చిన్నారి పేరును అధికారికంగా ప్రకటించారు. ఆంజనేయ స్వామి కృపతో పుట్టిన తమ కుమారుడికి “వాయువ్ తేజ్ కొణిదెల” అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. కొణిదెల కుటుంబంలో కొత్త శిశువు ఆగమనం ఆనందాన్ని నింపగా, అభిమానులు, సినీ వర్గాల నుంచి విపరీతమైన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
previous post