గత 18 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె నేటితో విజయవంతంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో చర్చలు విజయవంతం అయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో గత 18 రోజులుగా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
చర్చలు సఫలం కావడంతో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదానికి తెర పడింది. దాంతో శుక్రవారం నుంచి షూటింగ్‌లు పునః ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ జోక్యం, నిర్మాతలు, ఛాంబర్, లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి. శుక్రవారం నుంచి షూటింగ్‌లు యధావిదిగా జరుగుతాయి. సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఎన్నో చర్చలు జరిగినా పరిష్కారం మాత్రం శూన్యం. ఇప్పుడా సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. నాయకులు, నిర్మాతలు అర్ధం చేసుకొని ముందుకు వచ్చారు. నిర్మాతలు కూడా కార్మికులకు కావలసిన వాటి కోసం ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా పరిష్కారం తీసుకురమ్మని కోరారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సీఎం కి ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఫెడరేషన్ అర్థం చేసుకున్నదుకు కృతజ్ఞతలు.
లేబర్ కమిషనర్ గంగాధర్ చర్చలు సఫలం అయ్యేలా చేశారు. హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చెయ్యాలని సీఎం ప్లాన్ .. ఆదిశగా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది.’ అని దిల్ రాజు చెప్పారు. లేబర్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ ’30 శాతం హైక్ అనేది జరుగుతుంది. ఇరువైపులా పలు డిమాండ్స్ ఉన్నాయి. మూడు నాలుగు కండిషన్స్ మీద సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. 22.5 శాతం మొత్తంగా వేతనాల పెంపు (వేతనాల రేషియోను బట్టి మారుతుంది).
కార్మికుల విషయంలో నిర్మాతలు నాలుగు షరతులు పెట్టారు. నేడు ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. 22.5 శాతం వేతన పెంపునకు అంగీకరించారు. రూ.2 వేలలోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం, రూ.2 వేల నుంచి రూ.5 వేలు ఉన్నవారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నాం. మిగతా చిన్న చిన్న సమస్యల కోసం ఈ కమిటీ. నెల రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుంది. స్ట్రైక్ లేదు ఇక రేపటి నుంచి షూటింగ్స్ కంటిన్యూ అవుతాయి’ అని తెలిపారు