సంపాదకీయం హోమ్

సరిహద్దు గ్రామాల్ని ముంచేసిన పాక్ పాలకులు

#floods

దారుణమైన వరదల్లో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రజలు తమ పాలకులను తీవ్రంగా నిరసిస్తున్నారు. భారత్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు పహెల్గావ్ దాడికి పాల్పడిన తర్వాత భారత్ తీవ్రమైన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగా పాకిస్తాన్ లోని సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పహెల్గావ్ దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. దీనితో భారత్ నుంచి వచ్చే సింధు నదుల ప్రవాహం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తగ్గుతుందో పాకిస్తాన్ తో సమాచారం పంచుకునే వీలు పోయింది. ఈ కారణంగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

భారత సరిహద్దు దాటి వచ్చిన వరద నీరు పాకిస్తాన్ పంజాబ్‌లోని గ్రామాలలోకి రాగానే అక్కడి ప్రజలు మూటముల్లె సర్దుకుని వెళ్లిపోవాల్సి వస్తున్నది. నెల రోజుల్లో ఇలా ఇప్పటికి రెండు సార్లు జరిగింది. మే నెలలో భారత్–పాకిస్తాన్ సరిహద్దు యుద్ధం సమయంలో ఒకసారి ఇలా ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.

“యుద్ధం సమయంలోనే చాలా కోల్పోయాం. ఇప్పుడు నీరు మళ్లీ మమ్మల్ని తరిమేస్తోంది. ఇబ్బంది అంటే ఇబ్బందే. ఇది పాలకుల వల్ల జరిగిన ఉత్పాతమే” అంటూ సరిహద్దు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. “ఈ నెల మొదట్లో వరదలు మొదలయ్యాయి, తరువాత మరింత పెరిగాయి,” అని 27 ఏళ్ల బీబీ జుబైదా చెప్పింది. ఆమె ఏడు మంది కుటుంబ సభ్యులతో కలిసి మూడు గదుల ఇంటిలో నివసిస్తోంది.

వారి ఇంటి ఎదురుగా ఉన్న మసీదు ఇప్పుడు ప్రార్థన పిలుపు బదులు ఖాళీ చేయమని ప్రసారం చేస్తోంది. “పడవలు సిద్ధంగా ఉన్నాయి, వెళ్లదలచిన వారు ఎక్కండి” అని మసీదు మైకులు గట్టిగా చెబుతున్నాయి. కసూర్, భారత సరిహద్దు నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

ఇరుదేశాల మధ్య నదులు ఆరు దశాబ్దాలుగా సింధు జలాల ఒప్పందం కింద ఉన్నాయి. ఈ ఏడాది ఆ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఇందుకు కారణం పహెల్గావ్ లో 26 మందిని చంపిన దాడికి ఇస్లామాబాద్ మద్దతు ఇచ్చిందని భారత ఆరోపణ. పాకిస్తాన్ దాన్ని ఖండించింది. ఆ దాడి తరువాత రెండు అణ్వాయుధ శక్తుల మధ్య తీవ్రమైన కాల్పులు జరిగాయి.

అప్పటి నుంచే  సరిహద్దు గ్రామస్తులు ఇళ్లు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తరువాత రుతుపవనాల కారణంగా నదులు విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపిన ప్రకారం, గండా సింగ్ వాలా వద్ద సుట్లెజ్ నదిలో ప్రవాహం దశాబ్దాలుగా లేనంత ఎత్తుకు చేరింది. భారత్ లో ఒక బారేజీ పగిలిపోవడం కారణంగా ఈ స్థితి వచ్చింది.

ఇప్పటివరకు కనీసం 28 మంది మరణించారు. వరద నీరు మరింత దక్షిణం వైపు ప్రవహిస్తూ కొత్త ప్రాంతాలను ముంచే ప్రమాదం ఉంది. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్, మహోర్ ప్రాంతాల్లో మేఘవిస్ఫోటం 10 మంది ప్రాణాలు తీసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల నదుల డేటా మార్పిడి ఆగిపోయిందని పాకిస్తాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.

భారత్‌ సరైన హెచ్చరిక లేకుండా భారీ నీటిని విడుదల చేసిందని కూడా ఆరోపిస్తున్నారు. సింధూ జలాల ఒప్పందం కొనసాగి ఉంటే ప్రభావాన్ని బాగా తగ్గించగలిగేవాళ్లం అని పాకిస్తాన్ ప్రణాళికల మంత్రి అహ్సన్ ఇక్బాల్ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్‌ను ముంచలేదని భారత్ చెప్పింది.

అదుపుతప్పిన వర్షాలే కారణమని, అనేక వరద హెచ్చరికలు ఇచ్చామని కూడా తెలిపింది. రావి నదిపై ఉన్న మాధోపూర్ బారేజీలోని రెండు గేట్లు ఉధృత ప్రవాహానికి దెబ్బతిన్నాయని భారత అధికారులు తెలిపారు. “మాకు యుద్ధం వద్దు, మాకు అదనపు నీరు వద్దు. మాకు జీవించాలనిపిస్తోంది అంతే” అని అక్కడి ప్రజలు పాకిస్తాన్ పాలకులకు చెబుతున్నారు.

Related posts

పాక్ లో భారీ వరదలు: 327 మంది మృతి

Satyam News

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో వాసవి మాత

Satyam News

Leave a Comment

error: Content is protected !!