ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట పట్టణంలో జగ్గయ్యపేట మండలం రెవెన్యూ తాసిల్దార్ మనోహర్ వేధింపులతో అన్నవరం వీఆర్వో వరలక్ష్మి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు.
తాసిల్దార్ మనోహర్ అన్నవరం మరియు త్రిపురవరం గ్రామ పరిధిలో ఉన్న అసైన్ భూములకు పాసుపుస్తకాలను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేయాలని ఆదేశించడం, రెవెన్యూ పరమైన కార్యకలాపాలు ను సక్రమంగా వివరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
గత నాలుగైదు మాసాల నుండి తాసిల్దార్ మనోహర్ వేధింపులు పెరగడంతో తట్టుకోలేక వీఆర్వో వరలక్ష్మి క్రిమిసంహారక మందును తాగి చనిపోయేందుకు ప్రయత్నం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన వరలక్ష్మీ ముందుగా తాసిల్దార్ మనోహర్ వేధింపుల వలన నేను సరిపోతున్నానని ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఈ సమాచారం తెలుసుకున్న పలువురు గ్రామ శివారులో అపస్మారక స్థితిలో ఉన్న వరలక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. వరలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడకు మెరుగైన వైద్యం కోసం తరలించారు.
తాసిల్దార్ మనోహర్ మాత్రం పరారీ అయినట్లు సమాచారం. పోలీసు వారికి సమాచారం పంపించారు. తాసిల్దార్ మనోహర్ తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.