పాక్‌తో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పహల్గామ్ దాడి ప్రత్యక్ష సాక్షులు శశిధర్, సుమిత్ర డిమాండ్ చేశారు. ఉగ్రవాదం పోషించే పాక్‌తో సంబంధాలు పెట్టుకోవద్దు. పాక్ తీరు మార్చుకునే వరకు నిరసన తెలపాలి.
ఉగ్రవాద దేశమైన పాక్‌తో ఆటల్లోనూ పాల్గొనకూడదు అని వారు కోరారు. దేశంలో చాలామంది మ్యాచ్ ఆడొద్దని కోరుకుంటున్నారు. పాక్‌కు వ్యతిరేకంగా ఏ చర్యలుతీసుకున్నా సమర్థిస్తాం అని పహల్గామ్ దాడి ప్రత్యక్ష సాక్షులు శశిధర్, సుమిత్ర అన్నారు.
భారత్-పాక్ మ్యాచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. భారత్-పాక్ మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్న పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు చేస్తున్న వాదన చర్చనీయాంశం అయింది. పాక్‌తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డాం. పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం ఉండొద్దు.
మీరు మ్యాచ్ ఆడాలనుకుంటే దాడిలో ప్రాణాలు పోయిన మావారిని తీసుకురావాలి. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని మోదీ చెప్పారు. మరి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎందుకు నిర్వహిస్తున్నారు అని పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.