ముఖ్యంశాలు హోమ్

వైజాగుకు వైకాపా తలాక్!

#Jagan

ఇష్టపడి కట్టుకొన్న రిషికొండ ప్యాలస్‌లో కూడా చేతి వాటం చూపించడంతో.. బొక్కలు బయటపడ్డాయి. పవన్ కల్యాణ్ వెళ్లడంతో పరువుపోయింది. దాని మీద మొదలైందట ఇంట్లో పోరు. నేను ఇక అక్కడికి అడుగు పెట్టను అని. సరేలే గోదావరిలో మన కొత్త బంధువు పద్దూ రెడ్డికి ఆరోగ్యం సరిగా లేదు. కుదరగానే స్థలం వెతకమంటా.. అక్కడ కట్టిస్తా మరో ప్యాలస్ అని నచ్చ చెప్పబోయారట. ఇంట్లో గొడవలు తెల్సిందే కదా. మరో మలుపు తీసుకొందట గొడవ.

అప్పుడే మీతాత వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టి, బాగానే ప్లానింగ్ చేసుకొంది నీ చెల్లి. కూటమి ప్రార్థనలలో ఎలా అరంగేట్రం చెయ్యించారో చూశావు కదా. ఆమె కొడుకు రాజకీయ అరంగేట్రం గురించి చెప్పంగానే ఎంత రియాక్షన్ వచ్చిందో చూశావు కదా అని తుఫాను దిశగా వెళ్లిందట గొడవ.

తక్షణ ఉపశమనం క్రింద, వైజాగ్ రావట్లేదు. తాడేపల్లి ప్యాలస్ నుండే పాలన అని సకలానికి బాధ్యతలు ఇవ్వడం, ఆయనకు ప్రశ్నతో పాటు సమాధానం కూడా అందించే ఏంకర్‌ను అరేంజ్ చేసుకోవడం, వే2ఎస్ఎమ్మెస్ కాంక్లేవ్లో ఏదో చిన్నపిల్లలు కాకి ఎంగిలి.. నీతో కా.. అన్నట్లుగా వైజాగుకు వైకాపా తలాక్ చెప్పేయడం, చక చకా జరిగిపోయాయి.

ఇదేమన్నా రాష్ట్రమనుకొంటున్నారా లేదా మీ కొంపలో ఇష్టాలతో.. రోజుకో లిక్కర్ బ్రాండ్ లెక్కన, రాజధాని కూడా మారుస్తారా. ఐదేళ్ల్లు ఏమి పీకి కట్టగట్టారు అమరావతిలో.. ఇప్పుడు కొత్తగా రైతులకు మౌలిక వసతులు కల్పిస్తాం అని చెబుతున్నారు అనే సూటి పోటి మాటల నుండి, మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అని జనం కుమ్మేస్తున్నారు.

మధ్యలో మేము ఎలా కనిపిస్తున్నాం అని వైకాపా కార్యకర్తలు మొత్తం కాడిపడేసి నిర్వేదంలో జారుకున్నారు. ప్రస్తుతానికి మళ్లీ మొదటి పెళ్లాం దగ్గరికి అన్నట్లు, అమరావతి అంటూ వైజాగుకు తలాక్ చెప్పారు. తరువాత గోదావరికి వెళతారో గోదాట్లో దూకుతారో ఏమిటో గానీ.. కారు టైర్లను మార్చినట్లు, రాజధానుల మీదే నిలకడగా లేకపోతే.. మమ్మల్ని ఎవరు నమ్ముతారు అని ప్యాలస్ కథలు విన్న ఒక కరడుగట్టిన రెడ్డి తాడేపల్లి టీ కొట్టు దగ్గర వాపోయాడట.

అవి ఎలా వున్నా.. మా ఉత్తరాంధ్రా వాళ్లకు ఏమని చెప్పాలో అని అటు, సీమలో ఏమని చెప్పాలో అని ఇటు తలలు పట్టుకొంటున్నారు, మూడు రాజధానులు అంటూ ఎన్నికల ముందు ఊగిపోయిన వైకాపా సీనియర్ నాయకులు. కడపలో ఎన్ని కాపురాలు చూసి చెప్పాడో “చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, కంటిలోని నలుసు, కాలి ముల్లు, ఇంటిలోన పోరు ఇంతింత గాదయా! విశ్వదాభిరామ వినురవేమ!” అని మహానుభావుడు వేమన గారు ఈ పద్యం.

ఏది ఏమైనా వైజాగు జనాన్ని అభినందించాలి. ఎంత ఊదరగొట్టినా.. వైకాపా నైజాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, మొదటి నుండి నమ్మడం లేదు. ఇప్పుడు తాజాగా వైకాపా చూపిన విషవసనీయతకు అదేమీ కొత్తగా ఆశ్చర్యపోవడంలేదు.

Related posts

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News

సింగూర్ కాల్వలకు మరమ్మతులు చేయాలి

Satyam News

వనపర్తిలో లక్షల్లో అద్దె-వేలల్లో టాక్స్

Satyam News

Leave a Comment

error: Content is protected !!