కొడంగల్ మున్సిపల్ లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం తెల్ల వారుజామున విధులకు హాజరైన మున్సిపల్ కార్మికుడు జోగు అనంతయ్య పై ఓ కుక్క దాడి చేసింది. అంతటితో ఆగక రోడ్డుపై వెళ్తున్న పలువురిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన అనంతయ్యను చికిత్స నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ లోని ఫివర్ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న కొడంగల్ మున్సిపల్ రెండో వార్డు తాజా, మాజీ కౌన్సిలర్ మధు సూదన్ యాదవ్ మాట్లాడుతూ కొడంగల్ పట్టణంలో వీధి కుక్కల బెడద అధికమైందని కుక్కల నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొడంగల్ లో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు నలుగురు కుక్క కాటుకు గురైనట్లు సమాచారం.
కొడంగల్ పట్టణంలోని కార్గిల్ కాలనీలో నివాసం ఉంటున్న కురుమయ్య అనే వ్యక్తికి పిచ్చికుక్క కరవడంతో చేతి నరం కట్ కావడంతో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడంతో అక్కడ వైద్యులు హైదరాబాద్ తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొడంగల్ పట్టణంలో ముస్లిం యువకులకు మరో ఇద్దరు కుక్క కాటుకు గురైనట్లు సమాచారం. ఈరోజు మొత్తం 6 మందికి కరిచినట్లు సమాచారం అందుతా ఉంది.