తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం ఆదివారం ఉదయం సంప్రదాయబద్దంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న పాలకమండలి సభ్యులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రమాణం చేశారు. దేవాదాయ శాఖ చట్టం 1987 ప్రకారం అధికారులు సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేశారు.
11 మంది సభ్యులతో పాటు ఎక్స్ అపిషియో సభ్యులు పూజారి మురళీ స్వామి సహా ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్ మహేష్ యాదవ్ నేతృత్వంలో మంచి ముహర్తం కావడంతో ఉదయం 8 గంటల నుంచి 8.20 గంటల మధ్య సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యఅథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరైయ్యారు. అలాగే శ్యాప్ ఛైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, టిడిపి క్లస్టర్ ఇన్చార్జ్ పులుగోరు మురళీ, జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి తదితరలు పాల్గొన్నారు.