ప్రత్యేకం హోమ్

ఈ స్వరాభిషేకం సినిమా కథ కాదు

#CBNMeeting

ఆ కంఠంలోంచి జాలువారే ప్రతి రాగం, ప్రతి పదం ఒక ఆరాధనలా వినిపించేది. ఆ స్వరంలో తనువునంతా నింపి ఆమె ఆలపిస్తుంటే వింటున్న వారికి దైవం ప్రత్యక్షమైన అనుభూతి కలిగేది. ఆమె పేరు వరలక్ష్మి.

మంగళగిరిలో పుట్టి ముంబైలో స్థిరపడినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆమె మనసులో ఒకటే ఆవేదన. జన్మభూమి భవిష్యత్తుపై ఒక తెలియని భయం. “ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎవరు గాడిలో పెడతారు? ఎవరు ముందుకు నడిపిస్తారు?” అనే ప్రశ్న ఆమెను నిలకడగా ఉండనిచ్చేది కాదు. ఆమెకు ఒక విషయంపై మాత్రం నమ్మకం. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె మనసు గట్టిగా చెబుతోంది. ఆ నమ్మకమే ఆమెను ఒక పెద్ద నిర్ణయం తీసుకునేలా చేసింది. “చంద్రబాబు తిరిగి సీఎం అయితే, 108 దేవాలయాల్లో సంకీర్తనా గానం చేస్తాను” అని ఆమె మొక్కుకున్నారు. ఈ మొక్కు ఆమె మనసులో ఒక బలమైన సంకల్పంగా మారింది.

ఆ రోజు వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె కల నిజమైంది. ఆమె కళ్ళల్లో ఆనందం, మనసులో కృతజ్ఞత. ఇక ఆలస్యం చేయలేదు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో తొలి కచేరీతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఆమె గళం భక్తితో మార్మోగింది. ప్రతి ఆలయంలో ఆమె కంఠం నుండి వచ్చిన పాట ఒక ప్రార్థనగా, ఒక నివేదనగా దేవుడికి చేరింది. చివరిగా దుర్గమ్మ సన్నిధిలో ఆమె తన మొక్కును పూర్తి చేసుకున్నారు.

ప్రయాణం ముగిసింది. తన సంకల్పం నెరవేరింది. అయితే ఈ ప్రయాణం కేవలం మొక్కు తీర్చుకోవడం కోసమేనా? తన పాటలను విన్న జనం, తన మనసులో ఉన్న భావనను అర్థం చేసుకున్నారు. ఈ ప్రయాణం కేవలం ఒక అభిమానం కోసం చేసినది మాత్రమే కాదు. రాష్ట్ర భవిష్యత్తుపై ఉన్న నమ్మకంతో, తన జన్మభూమిపై ఉన్న ప్రేమతో చేసినది. ఒక సామాన్య మహిళకు కూడా రాష్ట్రం పట్ల ఎంత ప్రేమ ఉంటుందో తెలియజేసేది. అందుకే ఆమె ఈ కచేరీల ప్రయాణం గురించి రాసుకున్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందించాలని నిర్ణయించుకున్నారు.

ఆ క్షణం… వచ్చింది

అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆమె అడుగుపెట్టారు. ఎంతో అభిమానంతో ఆయనను కలిశారు. తన మొక్కు, తన ప్రయాణం గురించి వివరంగా చెప్పారు. ఆ సమయంలో ఆమె కళ్ళల్లో మెరిసిన అభిమానం ఎంతో స్వచ్ఛమైనది, నిజమైనది. ఆమె తన పుస్తకాన్ని ఆయనకు అందించారు. ఆ అభిమానాన్ని చూసి చంద్రబాబు నాయుడు కూడా చలించిపోయారు. ఆమె పట్ల కృతజ్ఞత తెలియజేస్తూ, ఆ పుస్తకంలో సంతకం చేశారు.

ప్రజల నమ్మకమే తన బలం, ప్రజల ఆశీర్వాదమే తన శక్తి అని ఆయన అన్నారు. వరలక్ష్మి లాంటి వాళ్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని చెప్పారు. ఆ ప్రయాణం ఒక మొక్కు మాత్రమే కాదు, ఒక అభిమాని కల. నిజమైన స్వరాభిషేకం. సోదరుడు భాష్యం రంగనాధ్ తో రక్షాబంధన్ వేళ కలిసింది. ఇలాంటి అభిమానమే ఆయనను మరింతగా రాష్ట్రం కోసం అహర్నిశలూ.. అంకితం అయ్యేలా చేస్తోంది.

Related posts

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్… సూపర్ హిట్

Satyam News

దేశంలో మధుమేహం పెరుగుదలకు కారణం ఏమిటి?

Satyam News

‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి

Satyam News

Leave a Comment

error: Content is protected !!